Advertisement

  • ముంబై ఇండియన్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్

ముంబై ఇండియన్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్

By: chandrasekar Mon, 19 Oct 2020 10:28 AM

ముంబై ఇండియన్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్


ముంబై ఇండియన్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోటాపోటీగా మ్యాచ్ సాగింది. అబుదాబీ సీన్ దుబయ్‌లోనూ రిపీట్ అయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ కూడా టై అయింది. 176 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేధించలేకపోయింది. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ మరోసారి అదరగొట్టాడు. 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 24, నికోలస్ పూరన్ 24 రన్స్ చేసి పరవా లేదనిపించారు. మయాంక్ అగర్వాల్ (14), మాక్స్‌వెల్ (0) విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ దూకుడుతో పంజాబ్ జట్టు ఈజీగా విజయం సాధిస్తుందనుకున్న సమయంలో ముంబై పేసన్ బుమ్రా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఊపు మీదున్న కేఎల్ రాహుల్‌ను 18వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. కేఎల్ రాహుల్ వికెట్ పడడంతో దెబ్బకు సీన్ మారింది. ఐతే ఆ తర్వాత దీపక్ హుడా, జోర్డాన్ ఆచితూచి ఆడుతూ బంతులను బౌండరీలకు తరలించారు. ఐతే చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన వేళ బంతిని బోల్ట్ చేతికి ఇచ్చాడు రోహిత్. మొదటి బంతికి దీపక్ హుడా సింగిల్ తీశాడు.

ఇక రెండో బంతిని బౌండరీకి పంపిన జోర్డాన్ మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతిని దీపక్ హుడా బీట్ చేశాడు. ఐదో బంతికి సింగిల్ తీశాడు. చివరి బంతికి రెండుపరుగులు కావాల్సిన సమయంలో జోర్డాన్ సింగిల్ మాత్రమే తీశాడు. రెండో పరుగుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ టై అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి అదరగొట్టాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 53 పరుగులు (3 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేసి ఆకట్టుకున్నాడు. డికాక్ మినహా ఇతర టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రోహిత్ శర్మ 9, సూర్యకుమార్ యాదవ్ 0, ఇషాన్ కిషన్ 7, హార్దిక్ పాండ్యా 8 పరుగులు మాత్రమే చేశారు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కృనాల్ పాండ్యా 34 పరుగులు చేశాడు. ఆఖరులో పొలార్డ్ 12 బంతుల్లో 34, కౌంటర్‌నైల్ 12 బంతుల్లో 24 మెరుపులు మెరిపించారు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. దాంతో ముంబై స్కోర్‌ 164కి చేరింది. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్‌కు చెరో వికెట్ దక్కింది.

Tags :
|

Advertisement