మాస్టర్ రాజా రిత్విక్ ప్రపంచ యూత్ ఆన్‌లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో...
By: chandrasekar Mon, 30 Nov 2020 12:43 PM
తెలంగాణ ఇంటర్నేషనల్
మాస్టర్ రాజా రిత్విక్ ప్రపంచ యూత్ ఆన్‌లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
అండర్-16
విభాగంలో వచ్చే నెల 11 నుంచి 13 వరకు జరిగే టోర్నీలో రిత్విక్ పోటీ పడనున్నాడు.
ప్రస్తుతం సైనిక్‌పురిలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం
చదువుతున్న రిత్విక్ సత్తాచూపించడానికి పట్టుదలతో కనిపిస్తున్నాడు.
ఫిడే రేటింగ్‌లో 2408
పాయింట్లతో కొనసాగుతున్న రిత్విక్.. ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో
కచ్చితంగా దేశం గర్వించేలా రాణిస్తాడని అతని కోచ్ ఎన్‌వీఎస్ రామరాజు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి టోర్నీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
Tags :
master |
youth |