భారీగానే పతనమైన స్టాక్ మార్కెట్!
By: chandrasekar Fri, 21 Aug 2020 1:49 PM
స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు గురువారం డీలా పడ్డాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు ఒకే రోజు ఏకంగా 70 వేల వరకు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. వీక్లీ ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఎక్స్‌పైరీ కారణంగా కూడా మార్కెట్‌లో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్
459 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా
11,300 పాయింట్ల కిందకు పడిపోయింది.
చివరకు వచ్చేసరికి సెన్సెక్స్
394 పాయింట్ల నష్టంతో
38,220 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96
పాయింట్ల నష్టంతో
11,312 పాయింట్ల వద్ద ముగిసాయి. నిఫ్టీ 50లో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ షేరు 7 శాతం మేర పెరిగింది. అదేసమయంలో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ స్టాక్ 3 శాతం పడిపోయింది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా ర్యాలీ చేసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1 శాతం, నిఫ్టీ ఫార్మా
0.03 శాతం లాభపడ్డాయి.
ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతం పడిపోయాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టపోయింది. 6 పైసలు నష్టంతో 74.82 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.17 శాతం తగ్గుదలతో 44.85 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు
1.11శాతం క్షీణతతో
42.63 డాలర్లకు తగ్గిపోయింది.