నిర్మాతగా మారనున్న మాస్ మహారాజ్ ..?
By: Sankar Fri, 26 June 2020 8:09 PM
ఇటీవల కాలం లో అందరూ హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు ..ఇప్పటికే రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేస్తున్నాడు ఇక కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా మారాడు ..అయితే మరొక స్టార్ హీరో కూడా నిర్మాణ రంగంలోకి దిగనున్నాడు అని తెలుస్తుంది
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేసిన రవితేజ దశ ఇడియట్‌తో తిరిగింది. ఈ సినిమా తర్వాత వరుస విజయాలు సాధించడంతో హీరోగా సెటిలైయ్యాడు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు రవితేజ సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై రవితేజ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాడని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న క్రాక్ చిత్రం తుది దశకు చేరుకుంది. మరో పదిరోజుల చిత్రీకరణ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా, త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్‌లోనూ రవితేజ నటించనున్నారు.