Advertisement

  • కరోనా లేదని నిరూపించలేక 965 Km నడిచిన చైనా వ్యక్తి

కరోనా లేదని నిరూపించలేక 965 Km నడిచిన చైనా వ్యక్తి

By: Sankar Tue, 23 June 2020 6:05 PM

కరోనా లేదని నిరూపించలేక 965 km నడిచిన  చైనా వ్యక్తి



ప్రపంచం మొత్తం కరోనా వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంది ..కరోనా వలన సాటి మనుషులతో ఆప్యాయంగా మాట్లాడటం సరికదా ఒకరికొకరు దగ్గర ఉండటానికి కూడా ప్రజలు జంకుతున్నారు ..ఎవరికీ ఈ వ్యాధి వుందో వాళ్ళతో కలిసి తిరిగితే మనకు వస్తుందేమో అన్న అనుమానంతో ప్రజలు ఎవరికీ వారే యమునా తీరే అన్నచందంగా తయారు అయ్యారు ..తాజాగా చైనాలో జరిగిన ఒక సంఘటన దీనికి ఒక మంచు తునక..

ఇండియాలో దూర ప్రయాణాలు చేయాలి అంటే తప్పనిసరిగా ఫోన్లో ఆరోగ్యసేతు ఉండాల్సిందే..చైనాలోనూ ఇలాంటి యాప్ ఉంది. ఇందులో ఫోన్ వాడే వ్య‌క్తి ఆరోగ్య వివ‌రాలు రిజిస్ట‌ర్ అయి ఉంటాయి. అంతేకాక‌ ద‌గ్గ‌ర్లోని క‌రోనా పేషెంట్ల వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంది. హోట‌ల్‌లో, ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల్లో, ఆఖ‌రికి సూప‌ర్ మార్కెట్ల‌లోనూ ఈ యాప్‌లో మీ వివ‌రాలు చూపించిన త‌ర్వాతే లోనికి అనుమ‌తి ఇస్తారు.

అయితే అస‌లు ఫోన్ అందుబాటులో లేని ఓ చైనీయుడు అష్ట‌క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది. చైనాలో గీ అనే వ్య‌క్తి త‌న సొంతూరికి వెళ్దామ‌నుకున్నాడు. దీనికోసం ప్ర‌జార‌వాణాను ఆశ్ర‌యించ‌గా అత‌డిని అనుమానంగా చూశారు. క‌రోనా లేద‌న్న న‌మ్మ‌కం ఏంటి? అంటూ అందుకు సాక్ష్యం చూపించ‌మ‌ని అడిగారు. అందుకు అత‌ను బిక్క‌మొహం వేశాడు. ఫోన్‌ యాప్ ద్వారా క‌రోనా లేద‌ని నిరూపించ‌వ‌చ్చు. కానీ అస‌లు స‌ద‌రు వ్య‌క్తి ద‌గ్గ‌ర ఫోన్ కూడా అందుబాటులో లేదు. దీంతో అత‌డు తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా, వాహ‌నాల్లో ఎక్కించుకోడానికి నిరాక‌రించారు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితిలో అత‌డు త‌న కాళ్ల‌ను న‌మ్ముకున్నాడు. 600 మైళ్లు అంటే 965 కి.మీ న‌డిచి స్వ‌స్థ‌లానికి చేరుకున్నాడు. అన్హుయ్ ప్రావిన్స్ నుంచి ఝిజియాంగ్ చేర‌డానికి అత‌డికి 15 రోజులు ప‌ట్టింది. ఈ ప్ర‌యాణంలో రాత్రిళ్లు పార్కుల్లో విశ్రాంతి తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపాడు

Tags :
|
|
|
|

Advertisement