Advertisement

  • 30 ఏళ్ళ పాటు ఒక్కడే 3 కిలోమీటర్ల కాలువను తవ్విన అభినవ భగీరధుడు

30 ఏళ్ళ పాటు ఒక్కడే 3 కిలోమీటర్ల కాలువను తవ్విన అభినవ భగీరధుడు

By: Sankar Sun, 13 Sept 2020 5:22 PM

30 ఏళ్ళ పాటు ఒక్కడే 3 కిలోమీటర్ల కాలువను తవ్విన అభినవ భగీరధుడు


మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు అని మనం చాల సార్లు చెప్పుకుంటూనే ఉన్నాం...అయితే కొంతమంది మాత్రం ఆ వ్యాఖ్యలను తమ యొక్క గొప్ప పనులతో నిజం చేసి చూయిస్తారు..ఆలా బీహార్ కు చెందిన దశరథ్ మాంఝి కొండను తగ్గి రహదారిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఒక్కడై ఈ పనికి పూనుకున్నాడు. తన భార్యకు జరిగినట్టుగా మరొకరికి జరగకూడదు అని చెప్పి రోడ్డును నిర్మించేందుకు ఏకంగా కొండను తవ్వి రోడ్డును నిర్మించాడు.

ఇప్పుడు అదే బీహార్ కు చెందిన భుయాన్ అనే వ్యక్తి 30 ఏళ్లపాటు కష్టపడి మూడు కిలోమీటర్ల మేర కాలువను తవ్వాడు. నివసించే గ్రామం సమీపంలోని కొండప్రాంతం నుంచి గ్రామంలోని చెరువు వరకు ఈ కాలువను తవ్వాడు. మూడు కిలోమీటర్ల కాలువ తవ్వేనందుకు 30 ఏళ్ళు పట్టింది. తనకు ఎవరూ సహాయం చేయలేదని, గ్రామం కోసమే ఈ పనిచేసినట్టు భుయాన్ పేర్కొన్నాడు.

వర్షాలు కురిసిన సమయంలో కొండపై నుంచి వచ్చే నీరు వృధాగా పోతోందని, కొండా నుంచి గ్రామంలోని చెరువు వరకు కాలువను నిర్మిస్తే నీరు వృధాగా పోకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ పనికి పూనుకున్నట్టు భుయాన్ పేర్కొన్నాడు. భుయాన్ గయా జిల్లాలోని కోదిల్వా గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ గ్రామం అడవులు, కొండల మధ్య ఉంటుంది. ఈ కాలువ వలన అడవిలో ఉండే జంతువులకు, గ్రామంలోని ప్రజలకు మేలు కలుగుతుందని భుయాన్ తెలిపాడు. దీంతో గ్రామంలోని ప్రజలు భుయాన్ ను అభినవ భగీరధుడిగా పిలుస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement