Advertisement

  • పెళ్ళికి అంగీకరించలేదని దారుణానికి ఒడిగట్టిన యువకుడు

పెళ్ళికి అంగీకరించలేదని దారుణానికి ఒడిగట్టిన యువకుడు

By: Sankar Wed, 16 Sept 2020 09:54 AM

పెళ్ళికి అంగీకరించలేదని దారుణానికి ఒడిగట్టిన యువకుడు


పెళ్లికి అంగీకరించలేదని ఓ మహిళపై కక్ష పెంచుకున్నాడు. ఆమె పరువు తీయాలని భావించాడు. అంతే తన క్రిమినల్ మైండ్ కు పని చెప్పాడు. గతంలో మహిళతో ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దారుణానికి ఒడి గట్టాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..గుజరాత్‌కు చెందిన ఆ మహిళ ముంబైలోని మలాద్ శివారులోని పఠాన్‌వాడీకి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది వివాహం నిశ్చయమైంది. జనవరిలో మహిళ మతపరమైన కార్యక్రమానికి ముంబైకి రావడంతో ముస్తాలి వోహ్రా ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో దృశ్యాలను వీడియో తీశాడు. అయితే ముస్తాలి వోహ్రా పద్ధతి నచ్చకపోవడంతో మహిళ తల్లిదండ్రులు నిశ్చితార్తం విరమించుకున్నారు.

దాంతో కోపంతో రగిలిపోయిన వోహ్రా ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అవి కాస్త వైరల్ గా మారడంతో మహిళ కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వోహ్రాపై సూరత్‌ జిల్లా అత్వలైన్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Tags :
|
|
|

Advertisement