విశాఖ జిల్లాలో ఓ ప్రబుద్దుడు ఎం చేశాడో తెలుసా..?
By: Anji Sat, 19 Sept 2020 09:43 AM
విశాఖ జిల్లా శ్రీహరిపురం లో కూతురు వయసు ఉన్న మహిళతో వ్యక్తి పరారీ. శ్రీహరిపురంలో 55 సంవత్సరాల వయసు ఉన్న బెహరా అనే వ్యక్తి.. భార్య, కుమారుడుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే బెహరాకు హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌కు చెందిన వ్యక్తితో పరిచయమైంది. ఈ క్రమంలో ఆయన భార్య(35)తో బెహరా పరిచయం పెంచుకున్నాడు. లావుగా ఉన్న ఆమెను సన్నగా మార్చుతానంటూ నమ్మించి బాగా దగ్గరయ్యాడు. ఆమెను గత వారం శ్రీహరిపురం తీసుకువచ్చాడు.
అయితే భార్య ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె భర్త ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విశాఖ జిల్లా శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన బెహరాపై అనుమానం ఉందని అక్కడ పోలీసులకు తెలియజేశాడు. దీనిలో భాగంగా అక్కడ పోలీసులు సివిల్ డ్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీహరిపురం వచ్చి బెహరా వద్ద విచారించారు. ఈ క్రమంలో అక్కడ స్థానికులు బెహరాతో వచ్చిన ఆమెను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకువెళ్తేందుకు యతి్నస్తున్నారని భావించి 100కు డయల్ చేశారు.
దీంతో అక్కడికి మల్కాపురం పోలీసులు వచ్చి సివిల్ డ్రస్‌లో ఉన్న ఎల్‌బీ నగర్ పోలీసులను ప్రశ్నించారు. తాము కూడా పోలీసులమని చెప్పి ఐడీ కార్డులు చూపించారు. ఈ క్రమంలో బెహరాతో పాటు ఆమె కూడా అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. వారి ఆచూకీ కోసం ఎల్‌బీ నగర్, మల్కాపురం పోలీసులు గాలిస్తున్నారు.