Advertisement

  • ఆర్మీ అధికారిగా మోసాల‌కు పాల్పడిన వ్యక్తి అరెస్టు

ఆర్మీ అధికారిగా మోసాల‌కు పాల్పడిన వ్యక్తి అరెస్టు

By: chandrasekar Wed, 30 Sept 2020 5:50 PM

ఆర్మీ అధికారిగా మోసాల‌కు పాల్పడిన వ్యక్తి  అరెస్టు


ఆర్మీ అధికారులుగా పేర్కొంటూ ఆర్‌సీ పురంలో ఓ యువ‌కుడిని కిడ్నాప్ చేసి బెద‌రింపుల‌కు పాల్ప‌డ్డారు. అరెస్టు అయిన వారిని నాగ‌రాజు ర‌ఘవ‌ర్మ అలియాస్ క‌ల్న‌ల్ కార్తికేయ(ప‌శ్చిమ గోదావ‌రి)‌, కే.రాజేశ్(ప‌శ్చిమ‌గోదావ‌రి)‌, ఎల్‌. రామ‌కృష్ణ‌(విజ‌య‌న‌గ‌రం), ఆర్‌. జోర్ సింగ్‌(కామారెడ్డి) గా గుర్తించారు. సైబరాబాద్ కమిషనర్ విసి సిజ్జనార్ వివరాలను వెల్ల‌డిస్తూ... ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తూ నాగరాజు రఘు వర్మ ప్రజలను మోసం చేస్తున్నాడ‌న్నారు. నకిలీ ఐడి కార్డులను సృష్టించ‌డం, ఆర్మీ యూనిఫామ్‌లను కొనుగోలు చేయ‌డం, డమ్మీ పిస్టల్‌ను కొనుగోలు చేయడమే కాకుండా నకిలీ శౌర్య అవార్డులను సృష్టించిన‌ట్లు పేర్కొన్నారు.

నాగ‌రాజు లాల్ బజార్, నారాయణగూడలలో ఆర్మీ ఆఫీసర్‌గా తనను తాను పరిచయం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. భారత సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చి చాలా మందిని మోసం చేసిన‌ట్లు తెలిపారు. అద్దె కార్లు తీసుకుని ఆర్మీ స్టిక్కర్లను అంటించార‌న్నారు. ఆర్మీ అధికారి హోదాలో తన సొంత జిల్లాలోని వివిధ ప్రదేశాలలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దుకాణాల ప్రారంభోత్సవాలకు హాజరయ్యేవాడన్నారు. ఆ ప్రాంతంలో అతని కటౌట్లను కూడా నెల‌కొల్పిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇటీవ‌ల నాగ‌రాజు త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఆర్మీ అధికారులుగా పేర్కొంటూ ఓ యువ వ్యాపార‌వేత్త‌ను కిడ్నాప్ చేశారు. అత‌ని వ‌ద్ద రూ. 30 వేలు తీసుకుని అత‌న్ని వ‌దిలిపెట్టిన‌ట్లుగా పేర్కొన్నారు.

Tags :
|

Advertisement