ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ జవాను మహేశ్
By: chandrasekar Mon, 09 Nov 2020 3:13 PM
ఉగ్రదాడిలో తెలంగాణకు
చెందిన వీర జవాను మహేశ్ ప్రాణాలు కోల్పోయినారు. జమ్ముకశ్మీర్ లోని కుప్వారా
జిల్లా మచిల్ సెక్టార్ లో ముష్కరులపై జరిపిన పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లు
నలుగురిలో మన తెలంగాణ జవాను మహేశ్ ఉన్నారు. ఉగ్రమూకలపై తన పరాక్రమాన్ని
ప్రదర్శించి వీరమరణం చెందిన ఆర్ మహేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లి.
దేశంలోకి చొరబడుతున్న ఆరుగురు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మహేశ్ తోపాటు మరో ఇద్దరు
భారత్ సైనికులు మృతిచెందారు.
ఉగ్రవాదుల చేతిలో
మరణించిన మహేశ్ ఏడాది క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల
క్రితం భారత సైన్యంలో చేరిన మహేశ్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందడంతో ఆ
కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే మహేశ్‌కు సైన్యంలో చేరాలన్నది లక్ష్యం. ఆ దిశగానే కుటుంబసభ్యులను
ఒప్పించి అందులో చేరాడు. మహేష్ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తీసుకువచ్చే అవకాశం
ఉంది. అతని మరణం వల్ల ఆ ప్రాంత ప్రజలను
శోకంలో ముంచింది.