మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామ్రాట్ విజ్ణప్తి
By: chandrasekar Thu, 21 May 2020 2:01 PM
డిగ్రీ, పీజీల్లో
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్
చేయాలని యూజీసీకి మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామ్రాట్ యూజీసీకి
విజ్ణప్తి చేశారు. దీనికి సంబంధించి యూజీసీకి ఆయన ఓ లేఖ రాశారు. కోవిడ్-19
కారణంగా విద్యా సంవత్సరం ముగింపుకు
వచ్చిందని, ఇలాంటి సమయంలో విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి
చేయలేమనిఆయన ఆ లేఖలో చెప్పుకొచ్చారు.
కరోనా విజృంభిస్తున్న
ఇలాంటి సమయంలో విద్యార్థుల ఆరోగ్యాల్ని పణంగా పెట్టలేం – మహారాష్ట్రలో 8 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ పరీక్ష
హాలులు కేటాయించి, వారి ప్రొటోకాల్‌ను చూసుకోవడం. నా అభిప్రాయం ఏంటంటే.
డిగ్రీ, పీజీ
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్
చేయండి’’ అని యూజీసీకి రాసిన లేఖలో ఉదయ్ సామ్రాట్ పేర్కొన్నారు. అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు
మహారాష్ట్ర విద్యార్థి సంఘం ఓ లేఖ రాసింది. జూలై 1 నుంచి జూలై 30 వరకు
నిర్వహించనున్న పరీక్షలు రద్దు చేయాలని ఆ లేఖలో పేర్కొంది.