Advertisement

  • మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్...

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్...

By: Sankar Wed, 30 Sept 2020 11:51 AM

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్...


దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోని నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే 13లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

సామాన్యుల నుంచి రాజకీయనాయకుల వరకు ఎవర్ని కూడా కరోనా వదలడం లేదు. మహారాష్ట్రలో అనేకమంది నేతలు కరోనా బారిన బడ్డారు. తాజాగా, మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన మంగళవారం రోజున నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. వైద్యుల సూచనల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు సామంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు మొత్తం 12 మంది మంత్రులు కరోనా బారిన పడినట్టు మహారాష్ట్ర వైద్యశాఖ పేర్కొన్నది..కాగా దేశంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అయితున్నాయి..రోజుకి 80 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అయితున్న దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది..ఇక రోజు వారి కేసులలో ఇండియా మొదటి స్థానంలో ఉంది..

Tags :
|

Advertisement