కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని... మళ్లీ దేశమంతా లాక్ డౌన్ మొదలు....!
By: Anji Mon, 21 Dec 2020 3:53 PM
లండన్లో విధించిన లాక్డౌన్ సుదీర్ఘకాలం కొనసాగవచ్చని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ అభిప్రాయపడ్డారు.
కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని లండన్ సహా బ్రిటన్లోని పలు ప్రాంతాల్లో దశల వారీగా ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తోంది.
కొత్తరకం కరోనా వ్యాప్తి కూడా ఆంక్షలను పటిష్ఠం చేసేందుకు కారణమైంది. హాన్కాక్ ఆదివారం నాడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఆంక్షల సడలింపులు ఇప్పట్లో కష్టమేనని హాన్కాక్ అభిప్రాయపడ్డారు. నాలుగో విడత లాక్డౌన్ విధించిన కొన్ని గంటలకే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
డిసెంబరు 19న లండన్ సహా ఇంగ్లాండ్ తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో రెండు వారాల లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 30న పరిస్థితి సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనున్నారు.