Advertisement

  • ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల వార్...

ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల వార్...

By: chandrasekar Fri, 18 Dec 2020 6:54 PM

ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల వార్...


రాష్ట్ర ఎన్నికల సంఘం జగన్ సర్కార్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఎస్ఈసీ జగన్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ అంటుంటే ప్రభుత్వం కుదరదని అంటోంది. కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సహకరించడం లేదని పిటిషన్‌లో ప్రస్తావించింది ప్రతివాదులుగా పంచాయతీ రాజ్ కార్యదర్శి, సీఎస్‌ను చేర్చింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

పిటిషనన్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టును ఎస్ఈసీ కోరింది. ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల్ని కాల రాస్తోందని ఎన్నికల విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు తెలిపిందని గుర్తు చేశారు. బీహార్, రాజస్థాన్‌లలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు ఓకే చెప్పిందని అఫిడవిట్‌లో ప్రస్తావించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది

Tags :
|

Advertisement