పిడుగుపాటుకు ఒడిశాలో ఆరుగురు మృతి
By: Sankar Tue, 01 Sept 2020 5:48 PM
ఒడిశాలో మంగళవారం పడిన ఉరుములు, మెరుపుల దాటికి మొత్తం ఆరుగురు వ్యక్తులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక సైతం ఉన్నట్లు చెప్పారు. కియోంజార్ జిల్లాలో వేర్వేరు చోట్ల పడిన మెరుపు సంఘటనలలో నలుగురు మరణించగా, మరో చోట ఇద్దరు చనిపోయారు. బాలసోర్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం కారణంగా చాలా మంది గాయపడ్డారు. కియోన్‌జార్ జిల్లాలోని రామచంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండువా గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక పిడుగుపాటుకు గురై చనిపోయింది.
సమీపంలోని సపుసాహీ గ్రామంలో పొలం పనుల్లో ఉన్న 55 ఏళ్ల రైతు, ఇంచోల్, బహరిపూర్ గ్రామాల్లో పొలం పనుల్లో ఉన్న మరో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. బాలాసోర్ జిల్లాలోని గోబఘటా గ్రామంలో 28 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో పాటు పాటు మరో ఇద్దరు గాయపడ్డారు.
వీరంతా పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కౌబని గ్రామంలో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలో 59 ఏళ్ల మహిళ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగుపాటుకు గురై చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.