Advertisement

  • ప్రముఖ నటుడు మరియు కమెడియన్ నర్సింగ్ యాదవ్ కన్నుమూత

ప్రముఖ నటుడు మరియు కమెడియన్ నర్సింగ్ యాదవ్ కన్నుమూత

By: chandrasekar Thu, 31 Dec 2020 11:09 PM

ప్రముఖ నటుడు మరియు కమెడియన్ నర్సింగ్ యాదవ్ కన్నుమూత


ప్రముఖ తెలుగు చిత్ర నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఈరోజు డిసెంబర్ 31, 2020వ తేదీ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయన తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన నడిచిన సినిమాలు మంచి గుర్తింపును పొందాయి.

ముఖ్యంగా ఆయన విలన్, కామెడీ సన్నివేశాల్లో అలరించారు. అన్ని భాషల్లో కలిపి ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యేక గుర్తింపును పొందారు. విజయ నిర్మల దర్శక, నిర్మాణంలో వచ్చిన హేమాహేమీలు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. నర్సింగ్ యాదవ్ గత 25 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్నారు.

నర్సింగ్ యాదవ్ స్వస్థలం హైదరాబాద్. క్షణక్షనం, ముఠామేస్త్రి, శంకర్ దాదా ఎమ్.‌బి.బి.ఎస్, గాయం, కిల్లర్, మాస్, మాయలోడు, ఫ్యామిలీ సర్కస్, టెంపర్, రేసుగుర్రం, పిల్ల జమిందార్, అన్నవరం, సైనికుడు వంటి సినిమాల్లో నటించారు. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు. ఈయన విలన్ గాను, అటు కమెడియన్ గాను మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగాను సినీ ఫీల్డ్ లో తనదైన ముద్ర వేశారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు మరియు అభిమానులు తమ సంతాపాన్ని తెలియజేసారు.

Tags :
|

Advertisement