Advertisement

వేసవి సెలవుల్లో విడుదల కానున్న వకీల్ సాబ్

By: chandrasekar Fri, 18 Dec 2020 11:17 AM

వేసవి సెలవుల్లో విడుదల కానున్న వకీల్ సాబ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ సినిమా కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. కొన్ని నెలల తరువాత మళ్ళీ ఆన్ లాక్ ప్రకటించడంతో తిరిగి షూటింగ్లు మొదలయ్యాయి. దీంతో ఈ సినిమాకి విడుదల డేట్ ను నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ సినిమా కోసం చాలాసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. రానున్న సంక్రాంతికి ఈ సినిమా విడులవుతుందని అభిమానులంతా ఎంతో ఆశతో ఎదురు చూసారు. కాని కరోనా వల్ల మళ్ళీ వాయిదా పడింది. దీంతో దేశంలో మహిళల దినోత్సవం మర్చి 8 వ తేదీన విడుదల కానున్నట్లు తెలిసింది.

కానీ మళ్ళీ వాయిదా వేసినట్లు సినీ వర్గాల నుండి సమాచారం. చివరిగా ఏప్రిల్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇందుకోసం నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందింది. వేసవి సమయానికి దేశంలో కరోనా ఉదృతి తగ్గి థియేటర్లలో మంచి కలెక్షన్ ను వసూలు చేయవచ్చని తెలిసింది. మరి అంత వరకు ఈ సినిమా కోసం ఆగాల్సిందే.

Tags :
|
|
|

Advertisement