అన్న మోసం- తమ్ముడు తప్పు- పోలీసు కేసు
By: Dimple Thu, 03 Sept 2020 08:45 AM
అన్నచేసిన తప్పుతో ముప్పు వాటిల్లుతోందని.. తమ్ముడు ఓ ఆధారంకోసం ప్రయత్నించి ఊఛలెక్కిస్తున్నాడు. మూడేళ్లు తనతో కాపురం చేసి, ఒక బిడ్డ పుట్టిన తర్వాత డ్రైవర్ సతీష్ మరో పెళ్లి చేసుకోవడంతోనే మాలతి ఆత్మాహుతి చేసుకున్నట్టు తేలింది. సతీష్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మాహుతి దృశ్యాలను వీడియో చిత్రీకరించిన వ్యక్తి సతీష్ సోదరుడు శరవణ కుమార్‌గా తేలింది. అతడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన కొడైకెనాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహిళ ఆత్మాహుతిని అడ్డుకోకుండా వీడియో చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆధారం కోసం ఆత్మాహుతిని తాను వీడియో చిత్రీకరించానని ఆ వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. దిండుగల్ జిల్లా కొడైకెనాల్ సమీపంలో మాలతి అనే మహిళ ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోకుండా, మానవత్వాన్ని మరిచి వీడియో చిత్రీకరించిన వ్యక్తి మీద సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. కనీసం ఆమెను రక్షించే ప్రయత్నం కూడా చేయకుండా అనేక మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మానవత్వం మంట కలిసిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.