కిసాన్ ఫసల్ బీమా యోజన ప్రీమియం రూ. 2,200 కోట్లు దోచుకున్నారు; శివరాజ్ సింగ్ చౌహాన్
By: chandrasekar Mon, 14 Sept 2020 12:17 PM
బిండ్‌లో ఆదివారం జరిగిన
ఒక కార్యక్రమంలో మాట్లాడిన చౌహాన్, మాజీ సీఎం కమల్‌నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత
దిగ్విజయ్ సింగ్‌పై మండిపడ్డారు. వారిద్దరు అవినీతిలో రికార్డు సృష్టించారని ఆయన
ఆరోపణలు చేసారు.
కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్
సింగ్ ఆధునిక దోపిడీదారులని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
విమర్శించారు. వారిద్దరు తోడు దొంగలని విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్ డబ్బులు, అభివృద్ధికి
ఉపయోగించాల్సిన నిధులను తమ జేబుల్లోకి వేసుకున్నారని ఆరోపించారు. కిసాన్ ఫసల్ బీమా
యోజన ప్రీమియం రూ. 2,200 కోట్లు దోచుకున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్
విమర్శించారు. రాష్ట్రంలోని గత కాంగ్రెస్ పాలనలో అంతా దోపిడీ జరిగిందని
ఆరోపించారు.
Tags :