కోజికోడ్ ఫ్లైట్ క్రాష్ ..కో పైలట్ భార్య నిండు గర్భిణీ ..భర్త చనిపోయినట్లు తెలీదు..
By: Sankar Mon, 10 Aug 2020 07:32 AM
కోజికోడ్ లో జరిగిన విమాన క్రాష్ ప్రమాదంలో పైలట్ తో సహా కో పైలట్ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే కో పైలట్ భార్య నిండు గర్భిణీ కావడం అందరిని బాధకు గురి చేస్తుంది ..ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేశ్ కుమార్ కొన్నేళ్లుగా ఎయిరిండియాలో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో మందిని సుక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు.
కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా కీలక విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా మే 8, 2020న ఎయిరిండియా విమానంలో దుబాయ్‌కు బయలుదేరారు. నాడు ఆయన బృందానికి కొజికోడ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సరిగ్గా 3 నెలల తర్వాత ఆగస్టు 7న అదే చోట ఆయన విగతజీవిగా మారారు.
అయితే అఖిలేశ్ భార్య మేఘ ప్రస్తుతం నిండు గర్భిణి. మరి కొన్ని రోజుల్లో వాళ్లింటికి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. బాధాకరమైన విషయం ఏమిటంటే కుటుంబసభ్యులు ఇప్పటికీ ఆయన భార్య మేఘకు ఈ దుర్వార్తను తెలియనివ్వలేదు.
కోజికోడ్‌లో విమాన ప్రమాదం జరిగిందని, విధుల్లో ఉన్న అన్నయ్య అఖిలేశ్‌కు గాయాలు అయ్యాయని తొలుత మాకు సమాచారం అందింది. రాత్రి పొద్దుపోయాక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. మా వదిన నిండు గర్భిణి కావడంతో ఈ విషయం ఆమెకు చెప్పలేదు. విమాన ప్రమాదంలో అన్నయ్య గాడపడ్డారని, హాస్పిటల్‌లో కోలుకుంటున్నారని చెప్పాం. మరో అన్నయ్య భువనేశ్, బావమరిది సంజీవ్ శర్మ కోజికోడ్‌కు బయల్దేరి వెళ్లారు’ అని అఖిలేశ్ సోదరుడు లోకేశ్ కుమార్ తెలిపాడు.