Advertisement

కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి రాజీనామా

By: chandrasekar Mon, 05 Oct 2020 09:45 AM

కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి రాజీనామా


బీజేపీ పార్టీకి చెందిన మంత్రి సీటీ రవి రాజీనామా చేసారు. కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కర్ణాటక సీఎం యడియూరప్పకు శనివారం పంపినట్లు సమాచారం. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం ప్రకటించిన పార్టీ జాతీయ కమిటీలో సీటీ రవికి కీలక పదవి దక్కింది. ఆయనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటీ రవి తన మంత్రి పదవికి రాజీమా చేశారు. దీంతో ఇంకో మంత్రి పదవి ఖాళీ ఏర్పడింది.

కీలక పదవి దక్కడంతో అయన బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ కీలక నేతలను కలవనున్నారు. కేంద్ర స్థాయిలో, జాతీయ రాజీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతలు అప్పగించిన కారణంగా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింన్నారు. ఇదివరకే కొన్ని మంత్రి పదవులు ఖాళీ ఉండగా తాజాగా ఆ సంఖ్య 6కు పెరిగింది. దీంతో కర్ణాటకలో త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement