కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి
By: Sankar Mon, 10 Aug 2020 8:14 PM
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మణిపాల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ద్వారా వెలువరించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే సీఎం యెడియూరప్ప తను కోలుకోవాలని కోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘నా కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. నేను ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. అలాగే ప్రస్తుతం ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటాను. మీ అందరి అప్యాయతలకు కృతజ్ఞుడిని. త్వరలోనే తిరిగి విధులు నిర్వహించాలని ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
కాగా యెడియరప్పకు ఆగస్టు 2 న కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెంటనే బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజే ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్ తేలడంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చేరారు.