కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజి యూనివర్సిటీ నోటిఫికేషన్
By: Sankar Tue, 01 Dec 2020 11:01 PM
కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొదటి విడుత వెబ్ కౌన్సిలింగ్ డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 4వ తేదీ రాత్రి 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని అన్నారు.
యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచిన తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు మొదటి విడుత వెబ్ కౌన్సిలింగ్‌కు అర్హులని తెలిపారు. వారందరూ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్ ఇవ్వాలని అన్నారు. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్ ను పరిశీలించవచ్చునని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.
Tags :
release |
mbbs |