అక్తర్ బౌలింగ్ లో సచిన్ కొట్టిన ఆ షాట్ మహా అద్భుతం ..కైఫ్
By: Sankar Fri, 14 Aug 2020 7:21 PM
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..అందునా అది ప్రపంచ కప్ మ్యాచ్ అయితే ఉత్కంఠ ఇక తార స్థాయిలో ఉంటుంది ..అలాంటి ఉత్కంఠ నడుమ ౨౦౦౩ లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ జట్టులోని దిగ్గజ బౌలర్లు అయిన అక్రమ్ , వకార్ , అక్తర్ లను చీల్చి చెండాడాడు ..అయితే ఆ మ్యాచ్ లో అక్తర్ బౌలింగ్ లో సచిన్ కొట్టిన అప్పర్ కట్ సిక్సర్ ఇప్పటికి అభిమానుల కాళ్ళ ముందు మెదలాడుతుంది..
అయితే తాజాగా కైఫ్ ఆ సిక్సర్ను గుర్తుచేసుకున్నాడు ..రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొట్టిన అప్పర్ సిక్స్ అద్భుతమని భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అన్నాడు. 2003 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సచిన్‌తో కలిసి 102 పరుగులు జోడించిన కైఫ్ ఆ మ్యాచ్ వివరాలను తాజాగా వెల్లడించాడు.
`17 ఏండ్ల తర్వాత కూడా ఆ మ్యాచ్ ఇంకా తాజాగానే అనిపిస్తున్నది. షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో పాయింట్ మీదుగా సిక్సర్ బాదడం అంటే మామూలు విషయం కాదు. 150 కిలో మీటర్ల వేగంతో వచ్చిన బంతిని అంతే వేగంగా కండ్లు చెదిరే రీతిలో సచిన్ పాజీ బౌండ్రీకి తరలించాడు. పాజీ బ్యాటింగ్‌ను ధ్యానంగా భావిస్తారు. అందుకే క్రీజులో ఉన్న సమయంలో ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడడు`అని కైఫ్ వివరించాడు.