ఆప్ఘనిస్థాన్ ఉగ్ర దాడిలో కాబూల్ డిప్యూటీ గవర్నర్ మృతి
By: chandrasekar Wed, 16 Dec 2020 09:24 AM
ఆప్ఘనిస్థాన్ లో ఉగ్ర
దాడి చేయడంతో కాబూల్ డిప్యూటీ గవర్నర్ ను హతమార్చారు. ఈ ఉగ్ర దాడి మందు పాత్రలు
పేల్చడంతో కాబూల్ డిప్యూటీ గవర్నర్ మొహిబుల్లా మొహమ్మదిని హతమార్చారు. ఈ
సంఘటన కాబూల్‌లోని పీడీ9
జిల్లా మాక్రోర్యాన్ 4 ఏరియాలో చోటుచేసుకుందని ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన
టోలో న్యూస్ సంస్థ తెలిపింది.
ఈ ఉగ్ర దాడిలో గవర్నర్ తో
బాటు అతని సెక్రటరీ మరణించినట్లు తెలిపారు. డిప్యూటీ గవర్నర్ యొక్క
బాడీగార్డులకు తీవ్ర మైన గాయాలు తగిలినట్లు తెలిసింది. ఈ దాడికి ఏ ఉగ్రవాద
సంస్థ పాల్పడిందని తెలియరాలేదు. ఈ ఘటనపై
విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలియజేసారు.
Tags :
kabul |
deputy |
governor |