ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంచనున్న అక్కడి ప్రభుత్వం
By: Sankar Thu, 03 Sept 2020 1:01 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే...ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని చిన్న పెద్ద దేశాలు ఈ కరోనా దెబ్బకు అతలాకుతలం అయ్యాయి..అయితే మరోవైపు కరోనా నిర్ములనకు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి... ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకున్నాయి...
అయితే.. జపాన్ ప్రభుత్వం కరోనావైరస్ వ్యాక్సిన్‌ను పౌరులందరికీ ఉచితంగా అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా తాము ఉచితంగా కరోనావైరస్ వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జపాన్ కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. చైనా ఔషధ దిగ్గజం సినోఫార్మ్ ఆగస్టులో బహ్రెయిన్‌లో కరోనా వ్యాక్సిన్‌ను పరీక్షించడం ప్రారంభించింది.
సుమారు 6 వేల మందిపై దీన్ని పరీక్షించినట్లు పరిశోధకులు తెలియజేశారు. ఈ వ్యాక్సిన్ పూర్తిస్థాయి పరిశీలిన వచ్చే ఏడాది జూలైలో పూర్తి కానున్నట్లు సమాచారం. ఏఎఫ్‌పీ లెక్క ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా వ్యాక్సిన్‌లను ప్రస్తుతం మానవులపై పరీక్షిస్తున్నారు.