Advertisement

  • యాంగ్జైటీ నుంచి బయట పడిన "జాక్వెలిన్ ఫెర్నాండెజ్"

యాంగ్జైటీ నుంచి బయట పడిన "జాక్వెలిన్ ఫెర్నాండెజ్"

By: chandrasekar Sat, 11 July 2020 11:03 AM

యాంగ్జైటీ నుంచి బయట పడిన "జాక్వెలిన్ ఫెర్నాండెజ్"


ప్రపంచవ్యాప్తం గా మానసిక ప్రశాంతతకీ, ఒత్తిడి తగ్గించుకోడానికీ యోగా ఎంతో హెల్ప్ చేస్తుంది. పేద, ధనిక, స్త్రీ, పురుష, చిన్నా,పెద్ద ఇలా ఏ తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య ఒత్తిడి. ఈ ఒత్తిడి సమస్య ఎక్కువైతే అది యాంగ్జైటీగా మారుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ వ్యక్తులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ప్రతిదానికి ఆందోళన చెందుతారు. ఏదైనా పని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అయినదానికీ, కానిదానికీ భయపడతారు. ఒంటరినైపోయానని అనుకుంటారు. ఆకలి, నిద్ర సమస్యలు ఎదుర్కొంటారు. ఇందులో నుంచి బయటపడడానికి ఒక్కోసారి కౌన్సెలింగ్ అవసరమౌతుంది. మరికొంతమంది వారంతట వారే బయటపడతారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ యాంగ్జైటీ నుంచి బయటపడ్డాను అని. తను ఈ మధ్య యాంగ్జైటీతో బాధపడ్డానని ఆమె చెప్పారు. అందులో నుంచి బయట పడడానికీ, ఒత్తిడి తగ్గించుకోడానికీ తనకు యోగా చాలా హెల్ప్ చేసిందనీ చెప్పింది. గత కొన్ని వారాలుగా తను యాంగ్జైటీని ఎదుర్కొంటున్నాననీ, రెగ్యులర్ గా యోగా చేయడం వలన తను ప్రస్తుతం లో జీవించాలనే ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాననీ తెలిపింది. జీవితానికీ, జీవించి ఉన్నందుకూ కృతజ్ఞతతో ఉండాలని కూడా యోగా తనకు నేర్పిందని ఆమె అన్నారు. ఆమె తన యోగా వీడియోని కూడా షేర్ చేశారు.

ఈ సంవత్సరంలోనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనెప్పుడూ సరదాగా, సంతోషంగా ఉంటానని అందరూ అనుకుంటారనీ, అది నిజం కాదనీ అన్నారు. కొన్నేళ్ళ క్రితం తను ఎక్స్పీరియెన్స్ చేసిన ఒక ఫేజ్ గురించి చెప్తూ ఆమె, " ఒక్కొక్కసారి ఎందుకు వస్తుందో కూడా తెలీకుండా ఏడుపు వస్తుంది. కొన్ని రోజులు అసలు మంచం మీద నుంచి లేవాలని అనిపించదు. ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం, దాన్ని ఎలా తప్పించుకోవాలో కూడా తెలీదు. అనుభవిస్తే తప్ప డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలీదు. దాన్ని ఫేస్ చెయ్యడానికి ఎవరం సిద్ధం గా ఉండం" అని అన్నారు.

తనకి ఉన్న యాంబిషన్, తన పని మీద తనకి ఉన్న ప్రేమ వల్లనే ఈ ఫేజ్ లోంచి బైటికి వచ్చానని ఆమె అన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలి అని తనకి ఉన్న కోరికే తనకి హెల్ప్ చేసిందని కూడా ఆమె అన్నారు. జాక్వెలిన్ రీసెంట్ మూవీ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ మిసెస్ సీరియల్ కిల్లర్. ఇందులో ఆమె మనోజ్ బాజ్పాయ్, మోహిత్ రైనాతో కలిసి నటించారు. ఆమె లాక్ డౌన్లో కూడా బిజీగానే ఉన్నారు. ఆమె సల్మాన్ ఖాన్ మ్యూజిక్ వీడియో తేరే బినా లో కూడా ఆమె కనిపించారు. నటించడంతో పాటూ, ఈ వీడియోకి సంబంధించిన లైటింగ్ వ్యవహారాలు కూడా ఆమే చూసుకున్నారు.

Tags :
|

Advertisement