Advertisement

  • ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల

By: chandrasekar Fri, 19 June 2020 3:53 PM

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల


తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాల వెల్లడి సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ సారి ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఉత్తీర్ణత శాతం రావడం ఇదే తొలిసారి అన్నారు. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 62 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

inter,first and second year,exam,results,released , ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ, సంవత్సర, పరీక్షల, ఫలితాలు విడుదల


ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 60.01గా ఉండగా దీనిలో బాలికలు 67.47 శాతం అదేవిధంగా బాలురు 52.30 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాకు అగ్రస్థానం దక్కగా 75 శాతంతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 22 వరకు కాలేజీలకు మార్కుల మెమోలు అందనున్నట్లు తెలిపారు.

రీ వాల్యుయేషన్‌, రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఒత్తిడికి గురైతే మానసిక నిపుణులను సంప్రదించాలన్నారు. ఇంటర్‌ బోర్డు ఆధ్వర్యంలో ఏడుగురు మానసిక నిపుణులను నియమించినట్లు వెల్లడించారు. త్వరలోనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement