రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ
By: chandrasekar Sat, 15 Aug 2020 5:48 PM
2021 లో తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం
అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. ప్రస్తుత సీఎంకు మరియు డిప్యూటీ సీఎం మధ్య
పోటీకి తీవ్రరూపం దాల్చింది. అధికార అన్నా డీఎంకేలో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.
ముఖ్యమంత్రి యడప్పాడి పళని స్వామికి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి మధ్య సీఎం పదవి
విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. వచ్చే యేడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు
జరగబోతున్నాయి.
ఈ సందర్భంగా సీఎం
అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలంటూ పన్నీర్ సెల్వం తీవ్రంగా ఒత్తిడి
తెస్తున్నారు. ఈ విషయంలోనే సీఎం పళని స్వామికి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి మధ్య ప్రచ్ఛన్న
యుద్ధం ప్రారంభమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరు ఐఏడీఎంకే ముఖ్యమంత్రి
అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో పోటీచేయనున్నారని ఇరు వర్గాల మధ్య పోటీ ఏర్పడింది.
ఇదే టార్గెట్‌గా డిప్యూటీ
సీఎం పన్నీర్ సెల్వం ఇంట్లో శనివారం కొందరు మంత్రులు సమావేశమైనట్లు సమాచారం. ఈ
సమావేశం మొత్తం రెండు అంశాల చుట్టే తిరిగింది. మొదటిది వచ్చే ఎన్నికల్లో బీజేపీతో
పొత్తు కాగా రెండోది ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ. సీఎం అభ్యర్థిగా తన పేరును
ప్రకటించాలని పన్నీర్ సెల్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు ఓ వర్గం తెలిపింది.
అంతేకాకుండా పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఏకంగా పోస్టర్లు కూడా వచ్చేశాయి.