ప్లేఆఫ్ స్థానం కోసం జట్లు మధ్య తీవ్ర పోటి...
By: chandrasekar Fri, 30 Oct 2020 9:45 PM
ఐపీఎల్ 2020లో
ప్లేఆఫ్ స్థానం కోసం జట్లు మధ్య తీవ్రంగా పోటి నడుస్తో్ంది. చెన్నైప్లేఆఫ్ రేసు
నుంచి నిష్క్రమించినప్పటికి ఇతర జట్ల ఆశలపై నీళ్లు చల్లుతుంది. గురువారం కోల్‌కతా
నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపోంది.. ఆ జట్టు ప్లేఆఫ్
అవకాశాల్ని దెబ్బతీసి౦ది. ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు ముంబయి ఇండియన్స్. రాయల్
ఛాలెంజర్స్ బెంగళూర్‌పై గెలిచి. పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానంలో చేరింది. ముంబయి
ఇండియన్స్ ప్రస్తుతం 16 పాయింట్లతో టెబుల్‌లో నెం.1
స్థానంలో ఉంది. ఆ జట్టు ఆడేబోయే మిగితా రెండు మ్యాచ్‌లు ఓడినా పర్వాలేదు.ఇప్పటికే
ముంబైకి కావాల్సినంత రన్‌రేట్ (+1.186)
కూడా ఉంది.
ఇక మిగితా జట్లు
విషయానికి వస్తే టేబుల్‌ల్లో మూడు స్ధానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (14),
ఢిల్లీ క్యాపిటల్స్ (14), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (12) ముంబై
తర్వాతి స్థానంల్లో ఉన్నాయి.
ఇక ఐదో స్థానంలో కోల్‌కతా
ఉండగా ఆ జట్టు ఫ్లే ఆఫ్ చేరడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. కేకేఆర్ జట్టు నెట్
రన్‌రేట్ -0.467గా ఉంది. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 10
పాయింట్లతో +0.396 రన్ రేటుతో ఉంది. ముంబై తర్వాత మెరుగైనా రన్‌రేటు
ఉన్న జట్టు హైదరాబాద్. 12 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఐదు విజయాలతో ఆరో స్థానంలో
ఉంది.
కావునా మిగితా రెండు
మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. ఈజీగా ప్లేఆఫ్‌కి చేరొచ్చు. కానీ పంజాబ్ ఒక్క మ్యాచ్‌లో
ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా 10
పాయింట్లతో రన్‌రేట్ -0.505తో ఏడో స్థానంలో ఉంది. ఈ జట్టుకు కూడా ప్లేఆప్
అవకాశాలు తక్కువే.