కార్యకర్తలకు భీమా చేయించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
By: Sankar Mon, 23 Nov 2020 11:41 PM
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ బీమా చేయించారు.
తాజాగా ఈ బీమా పత్రాలను పవన్ కళ్యాణ్ కు బీమా సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ బీమాలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యులకు వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఎక్కడ ప్రమాదం చోటుచేసుకున్న వాయిదా ఖర్చులకు రూ.50 వేల వరకు బీమాను వర్తింపజేస్తారు.
కార్యకర్తలకు బీమా విషయంలో ఎప్పుడు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా జిలాల్లోను తగిన సమాచారం అందించి వారికి సహాయపడేలా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులను ఆదేశించారు.