జో బైడెన్ టీములో భారత సంతతి మహిళ అయిషా షా కు కీలక పదవి
By: Sankar Tue, 29 Dec 2020 6:22 PM
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ యంత్రాంగంలో పలువురు భారతీయ సంతతి వ్యక్తులను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా, వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ బృందాన్ని బైడైన్ సోమవారం ప్రకటించారు. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన అయిషా షాకు సముచిత స్థానం దక్కింది. వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ బృందంలో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గ అయిషా షా పేరును బైడెన్ సూచించారు. డిజిటల్ స్ట్రాటజీ విభాగానికి డైరెక్టర్‌గా రోబ్ ఫ్లాహెర్టీని ఎంపిక చేశారు..
కశ్మీరీ సంతతికి చెందిన ఆయిషా షా గతంలో బైడెన్-హ్యారిస్ ఎన్నికల ప్రచారానికి డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం స్మిథోసినియన్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్వాన్స్‌మెంట్ స్పెషలిస్ట్‌గా ఆయిషా పనిచేస్తున్నారు.కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం బిడెన్ విజయాన్ని ఒప్పుకోవడంలేదు ..ఇక వచ్చే జనవరి లో బిడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది...