Advertisement

  • పాకిస్థాన్ పీఎన్ఎస్ టబుక్ యుద్ధ నౌకను గుర్తించిన భారత నేవీ

పాకిస్థాన్ పీఎన్ఎస్ టబుక్ యుద్ధ నౌకను గుర్తించిన భారత నేవీ

By: chandrasekar Sat, 19 Dec 2020 11:42 AM

పాకిస్థాన్ పీఎన్ఎస్ టబుక్ యుద్ధ నౌకను గుర్తించిన భారత నేవీ


పాకిస్థాన్ కు సంబందించిన ఒక యుద్ధ నౌకను భారత నేవీ గుర్తించింది. పాకిస్థాన్ పీఎన్ఎస్ టబుక్ యుద్ధ నౌకను రొమేనియా దేశం నుండి కొనుగోలు చేయడంతో దానిని అక్కడ నుండి పాకిస్థాన్ కు తీసుకు వస్తుండగా దాని కదలికలను మన యుద్ధ నౌక పసిగట్టింది. భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక హిందూ మహా సముద్ర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నది.

ఈ నౌక పాక్ యుద్ధ నౌక కదలికలను గుర్తించింది మనకు సమాచారం అందించింది. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశ సరిహద్దుల గుండా చొరబాట్లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. మన భద్రత దళాలు వీరి ప్రవేశాన్ని అడ్డుకొని ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహిస్తుంది. చైనా ప్రేరేపణ వల్ల పాక్ మరింత దుశ్చర్యకు పాల్పడుతుంది.

Tags :
|
|

Advertisement