Advertisement

  • లైంగిక చర్య కోసం ఒత్తిడి తెచ్చినందుకు సింగపూర్‌లో భారతీయ వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష

లైంగిక చర్య కోసం ఒత్తిడి తెచ్చినందుకు సింగపూర్‌లో భారతీయ వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష

By: chandrasekar Wed, 21 Oct 2020 6:40 PM

లైంగిక చర్య కోసం ఒత్తిడి తెచ్చినందుకు సింగపూర్‌లో భారతీయ వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష


లైంగిక చర్య కోసం ఓ మైనర్ బాలికపై ఒత్తిడి తెచ్చినందుకు సింగపూర్‌లో ఓ భారతీయ వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష పడింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆ టీనేజ్ యువతిపై అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆ టీనేజ్ యువతికి అడిగినవన్నీ కొనిచ్చి... అందుకు బదులుగా లైంగిక చర్య కోసం ఆమెపై అతను ఒత్తిడి తెచ్చినట్లుగా ఆ మీడియా తెలిపింది. భారత్‌కు చెందిన చెల్లం రాజేష్ కన్నన్(26) అనే యువకుడు కొన్నేళ్లుగా సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య,కొడుకు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజేష్‌కు గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ 16 ఏళ్ల టీనేజ్ యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరూ తరుచూ మెసేజ్‌లు చేసుకునేవారు.ఇదే క్రమంలో గత ఏడాది అగస్టు నెలలో రాజేష్, ఆ టీనేజర్ ఇద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో రాజేష్ ఆమెకు ఒక సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మరోసారి రాజేష్‌ను కలిసేందుకు ఆమె ఒప్పుకుంది. ఈసారి తనకోసం కొన్ని మద్యం బాటిళ్లు తీసుకురావాలని కోరింది.

అలా సెప్టెంబర్ 8న యిషిన్ అవెన్యూ 11లోని ఆ టీనేజ్ యువతి ఫ్లాట్‌లో ఇద్దరు కలుసుకున్నారు. కోరినట్లుగానే రాజేష్ ఆమెకు మద్యం బాటిళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. అనంతరం ఆ టీనేజ్ యువతిని తనతో పాటు మెట్ల వద్దకు రావాలని పిలిచాడు రాజేష్. అక్కడికెళ్లాక రాజేష్ ఆమెను ముద్దు పెట్టుకుంటానని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అడిగినవన్నీ కొనిస్తున్నందుకు తనకు సహకరించాలన్నాడు రాజేష్. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ముద్దుపెట్టుకుని... లైంగిక చర్య కోసం ఒత్తిడి చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి షాన్ హో... నిందితుడు రాజేష్‌కు ఏడు నెలల జైలు శిక్ష విధించారు. నిందితుడు రాజేష్ మాట్లాడుతూ... 'ఈ కేసును ఎదుర్కొనే క్రమంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా ఉద్యోగం పోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య,రెండేళ్ల కుమార్తె దూరమయ్యారు. సింగపూర్‌లో ఉన్న మూడేళ్లలో గతంలో నేను ఎలాంటి నేరాలకు పాల్పడలేదు. జరిగిన ఘటన నాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తోంది..' అని పేర్కొన్నాడు. ఈ ఘటన పట్ల తాను చాలా పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు చెప్పాడు.

Tags :
|
|
|

Advertisement