పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు వెళ్లనున్న టీమిండియా
By: Sankar Wed, 22 July 2020 3:19 PM
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అడిలైడ్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ నికీ హాక్లే మంగళవారం వెల్లడించారు. అయితే నికీ ప్రకటన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అభిప్రాయానికి భిన్నంగా ఉండడం గమనార్హం.
ఆ పర్యటనలో టీమిండియాకు రెండు వారాల క్వారంటైన్ అవసరంలేదని గతంలో గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్వారంటైన్ నిబంధనల ప్రకారం కోహ్లీ సేనకు, సహాయక సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని నికీ చెప్పారు. ‘మేం సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఎదుర్కొంటాం. ఓల్డ్‌ట్రాఫర్డ్, ఏజియస్ బౌల్ మాదిరి అడిలైడ్ స్టేడియంలో హోటల్ సదుపాయం ఉంది’ అని ఆయన వివరించారు.
అయితే కరోనా విజృంభణ కంటే ముందే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఖరారు అయింది ..అయితే కరోనా రావడంతో ఈ సిరీస్ జరుగుతదా లేదా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి ..అందులోనూ ఆస్ట్రేలియాలోని జరిగే టి ట్వంటీ వరల్డ్ కప్ కూడా వాయిదా పడటంతో ఈ సిరీస్ నిర్వహణ మీద సందేహాలు మరింత ఎక్కువ అయ్యాయి ..అయితే ఇపుడు ఈ ప్రకటనతో ఇండియా ఆస్ట్రేలియా పర్యటన కంఫర్మ్ అయింది ..