Advertisement

  • భారత బ్యాడ్మింటన్ స్టార్ అర్జున అవార్డు గ్రహీతకు కరోనా పాజిటివ్..

భారత బ్యాడ్మింటన్ స్టార్ అర్జున అవార్డు గ్రహీతకు కరోనా పాజిటివ్..

By: Sankar Fri, 28 Aug 2020 10:48 AM

భారత బ్యాడ్మింటన్ స్టార్ అర్జున అవార్డు గ్రహీతకు కరోనా పాజిటివ్..


భారత్‌లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు వారాల క్రితం సిక్కిరెడ్డి ఈ వైరస్ బారినపడగా.. తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి‌కి కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో.. సాత్విక్ ప్రస్తుతం అమలాపురంలోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. అర్జున అవార్డుకి ఎంపికైన 20 ఏళ్ల సాత్విక్ శనివారం (ఈ నెల 29న) దాన్ని అందుకోవాల్సి ఉంది.

రోనా వైరస్ సోకడంపై మీడియాతో సాత్విక్ మాట్లాడుతూ ‘‘దురదృష్టవశాత్తు ఇది అంగీకరించాల్సిన నిజం. కొద్దిరోజుల క్రితం నేను టెస్టు (యాంటిజెన్) చేయించుకున్నా. ఆ తర్వాత ఆర్‌టీ- పీసీఆర్ టెస్టులోనూ కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండి మందులు తీసుకుంటున్నా.

నా స్నేహితులు, అమ్మానాన్నలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు. మరి నాకు ఎలా వచ్చిందో..? అర్థం కావడం లేదు. నాలోనూ ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు. మూడు రోజులు తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటా’’ అని సాత్విక్ వెల్లడించాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వర్చువల్‌గా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా.. కార్యక్రమానికి సాత్విక్ దూరంగా ఉండబోతున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) తెలిపింది.

Tags :
|
|
|

Advertisement