ఇండియాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Thu, 24 Dec 2020 10:00 AM
ప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ విజృంభణ మొదలయింది...బ్రిటన్ , సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో ఈ కొత్త వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది...ఇక తాజాగా ఇండియాలో కూడా కరోనా కేసులు పెరిగాయి..
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,712 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి కన్నా మూడు శాతం అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 29,791 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్క రోజే 312 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,01,23,778గా ఉంది. దీంట్లో యాక్టివ్ కేసులు 2,83,849 ఉన్నాయి. ఇప్పటి వరకు రికవరీ అయినవారి సంఖ్య 96,93,173. మొత్తం మరణించిన వారి సంఖ్య 1,46,756గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది..
Tags :
india |
reports |
24712 |