దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...
By: Sankar Wed, 23 Dec 2020 11:13 AM
భారత్ కరోనా వైరస్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ కాస్త పెరుగుతున్నాయి... కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 23,950 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..
333 మంది మృతిచెందారు, ఇదే సమయంలో 26,895 మంది రికవరీ అయ్యారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066కు పెరిగింది... ప్రస్తుతం భారత్‌లో 2,89,240 యాక్టివ్ కేసులు ఉండగా... రికవరీ కేసుల సంఖ్య 96,63,382కు చేరుకుంది...
ఇక, ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,46,444 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.కాగా కొత్త తరహా కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను కలవరపెడుతోంది.. బ్రిటన్ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో కొందరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా... ఇది.. కొత్త తరహా వైరసా? లేక పాతదేనా? అనే తేల్చడం కోసం శాంపిల్స్‌ను పుణెకు పంపించారు...