దేశంలో తాజా కరోనా కేసులు ఎన్నంటే !
By: Sankar Wed, 30 Dec 2020 1:17 PM
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఇటు కేసులు పెరుగుతుంటే.. కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతోంది. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..
కరోనాతో 286 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 26,572 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,44,853 కు చేరుకుంది..
ఇప్పటివరకు కరోనాబారిన పడిన 98,34,141 మంది రికవరీ కాగా.. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,48,439 కు పెరిగింది.. ఇక, దేశవ్యాప్తంగా 2,62,272 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది..
Tags :
india |
reports |
20550 |