దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు ..
By: Sankar Tue, 22 Dec 2020 11:23 AM
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. కొత్తగా 30,376 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 96,36,487 కోలుకున్నారు. మరో 301 మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,46,111కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,92,518 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.
ఇదిలా ఉండగా.. సోమవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 10,72,228 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 16,31,70,557 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.