- హోమ్›
- వార్తలు›
- బలమైన పేస్ ఎటాక్ ఉంటేనే ఆస్ట్రేలియాలో అడుగు పెట్టండి ..ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైక్ అథర్టన్
బలమైన పేస్ ఎటాక్ ఉంటేనే ఆస్ట్రేలియాలో అడుగు పెట్టండి ..ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైక్ అథర్టన్
By: Sankar Fri, 26 June 2020 6:55 PM
టీం ఇండియా జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన అంటే కత్తి మీద సాము లాంటిది ..గత పర్యటనలో సిరీస్ విజయం సాధించినప్పటికీ కీలక ఆటగాళ్లు లేక ఆస్ట్రేలియా జట్టు బలహీన పడటంతో ఆ విజయానికి పెద్దగా గుర్తింపు దక్కలేదు ..అయితే ఈ సారి మాత్రం అందరూ కీలక ఆటగాళ్లు మరియు యువ ఆటగాళ్లతో ఉన్న పటిష్ట ఆస్ట్రేలియా జట్టును ఢికొట్టాలంటే ఇండియా ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం వారి పేస్ బౌలింగ్ దళం అని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైక్ అథర్టన్..
ఇటీవల కాలంలో రాటుదేలిన టీమిండియా పేస్ బౌలింగ్.. ఆస్ట్రేలియాలో జూలు విదిల్చక తప్పదన్నాడు. భారత్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్‌తో ఆసీస్‌ను భయపెడితేనే సిరీస్‌లో పోరాడే అవకాశం ఉంటుందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే బలమైన పేస్ బౌలింగ్ ఎటాక్ లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టవద్దన్నాడు. సాధ్యమైనంతవరకూ పేస్ బౌలింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు.
బ్యాటింగ్‌లో భారత్ బలాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ శర్మ ఎర్రబంతితో కూడా బాగా రాణిస్తున్నాడు. అతనికి జతగా ఓపెనర్‌గా దిగే మయాంక్ అగర్వాల్ యావరేజ్ కూడా బాగుంది. విరాట్ కోహ్లి, చతేశ్వర పుజారాలతో టాపార్డర్ బలంగా ఉంది. ఓవరాల్‌గా టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. కానీ పేస్ బౌలింగ్‌తో ఆసీస్ పని పట్టకపోతే బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా అనవసరం’ అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు. 2018-19 సీజన్‌లో ఆసీస్‌పై సాధించిన టెస్టు సిరీస్ విజయాన్ని టీమిండియా రిపీట్ చేయాలంటే పేస్ బౌలింగ్‌తో చెలరేగిపోవాలన్నాడు