ఆంద్ర ప్రదేశ్ లో ఒక్క రోజులో 31 మంది మృతి
By: chandrasekar Sat, 10 Oct 2020 10:19 AM
ఆంద్ర ప్రదేశ్లో
ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 7,44,864 గా చేరింది.
గత 24 గంటల్లో 70,521 మందికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో 5,145
మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
కరోనా నుంచి గత 24
గంటల్లో 6,110 మంది
కోలుకోగా అలా ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య మొత్తం 6,91,040గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 31 మంది మృతి చెందారు.
దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,159 చేరింది. రాష్ట్రంలో
ఇప్పటివరకు జరిగిన మొత్తం కరోనావైరస్ పరీక్షల సంఖ్య 64,20,474 కి చేరింది.
కరోనా సోకి గత 24
గంటల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో
నలుగురు, అనంతపురంలో
ముగ్గురు, తూర్పు
గోదావరిలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు
జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, కర్నూలులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ
గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు