ఎవరైనా యుద్ధం మొదలు పెడితే నేను దాన్ని ముగిస్తానన్న కంగనా
By: chandrasekar Sat, 19 Sept 2020 09:35 AM
సుశాంత్ సింగ్ మరణం
తరువాత ట్విట్టర్లో చాలా ట్వీట్లు చేసి కంగనా రనౌత్ ప్రముఖంగా వార్తల్లో ఎక్కారు.
బాలీవుడ్‌లో నెపోటిజంపై ఫైట్ చేస్తున్న కంగనా రనౌత్ తనకు కయ్యాలు నచ్చవని
ప్రకటించింది. తాను కయ్యాలకు దూరంగా
ఉంటానని, ఎవరి
జోలికి వెళ్లనని, అయితే ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనని
ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తాను అందరితో గొడవలు పెట్టుకుంటానని చాలా మంది
భావిస్తారని, కానీ అందులో ఏమాత్రం నిజంలేదని ఆమె పేర్కొన్నది.
ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తాను ట్విట్టర్ నుంచి వైదొలుగుతానని ప్రకటిచింది.
ఇటీవల్ల మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈమెకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది.
కంగనా భవనాన్ని కూడా
ఇంతకు మునుపు కూల్చేసిన సంఘటన అందరికి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య తర్వాత
బాలీవుడ్‌లో నెపోటిజానికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నది. అందుకే గత కొన్ని నెలల
నుంచి ఆమె వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో నేను
ముందుగా కయ్యానికి కాలు దువ్వుతానని అంటున్నారు. నేను అలా ఎప్పుడూ చెయ్యలేదు.
ఎవరైనా యుద్ధం మొదలు పెడితే నేను దాన్ని ముగిస్తాను. ఒకవేళ నేనే ఫైట్ మొదలు
పెడతాను అని ఎవరైనా నిరూపిస్తే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటా. నిన్ను
ఎవరైనా యుద్ధం మొదలు పెట్టమని చెబితే
నువ్వు దాన్ని తిరస్కరించు అని శ్రీకృష్ణుడు
చెప్పాడు అని కంగనా ట్వీట్ చేసింది.