Advertisement

  • ఐసీసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా ..ఐపీయల్ నిర్వహణపై ప్రభావం పడుతుందా !

ఐసీసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా ..ఐపీయల్ నిర్వహణపై ప్రభావం పడుతుందా !

By: Sankar Sun, 27 Sept 2020 3:52 PM

ఐసీసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా ..ఐపీయల్ నిర్వహణపై ప్రభావం పడుతుందా !


భారత్ లో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో ఐపీఎల్ 2020 ని యూఏఈ వేదికగా అని కరోనా నియమాల మధ్య బీసీసీఐ నిర్వహిస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడి ఐసీసీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతుంది. దీని ఎఫెక్ట్ ఏమైనా ఐపీఎల్ 2020 పై పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయం పై అక్కడి ఓ ఐసీసీ అధికారి మాట్లాడుతూ... యూఏఈ లోని ఐసీసీ కార్యాలయంలో లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకినా వార్త నిజమే. అయితే వారందరిని కరోనా నియమాల ప్రకారం ఐసొలేషన్ లోకి పంపించాము. అలాగే వారిని కలిసిన వారిని కూడా క్వారంటైన్ కు వెళ్ళమని తెలిపాము. ఇక ఈ కార్యాలయంలో లో పని చేస్తున్నమిగిత వారందరిని ఇంటి వద్ద నుండే పని చేయమని సూచించాము. అందువల్ల ఇక్కడ జరుగుతున్న ఐపీఎల్ కు ఎటువంటి సమస్య ఉండదు.

దాని కోసం మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని ఆయన తెలిపారు. ఇక ఐపీఎల్ 13వ సీజన్ అక్కడ దుబాయ్‌, షార్జా, అబుదాబీ మూడు వేదికలో మాత్రమే జరుగుతుంది. ఇక ఈ రోజు ఈ టోర్నీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది.

Tags :
|
|
|

Advertisement