ఐసీసీ చైర్మన్ 'బార్‌క్లే' ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ పై స్పందన
By: chandrasekar Mon, 30 Nov 2020 11:25 PM
ఐసీసీ చైర్మన్ 'బార్‌క్లే' ఇండియా
మరియు పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ పై స్పందించారు. ఇండియా మరియు పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ అంటే
ఆ క్రెజ్ వేరు. కానీ ఇరు దేశాల మధ్య
ద్వైపాక్షిక సిరీస్‌లో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. దాయాది దేశాల మధ్య ప్రతి
మ్యాచ్ హైవోల్టేజ్‌లోనే సాగుతుందని అందరికి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య
ప్రస్తుతం సత్సంబంధాలు లేని కారణంగా క్రికెట్ సిరీస్ కూడా నిలిచిపోయింది.
చాన్నాళ్ల నుంచి పాక్‌తో ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడడం లేదు. పాకిస్థాన్
ఉగ్రవాదుల చర్యల వల్ల ఇరు దేశాల సంబంధాలు దెబ్బ తినడంతో మ్యాచ్ లు ఆడడంలేదు.
కానీ ప్రస్తుతం తాజాగా
అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్‌గా ఎన్నికైన 'బార్‌క్లే' ఇరు
దేశాల క్రికెట్ సిరీస్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని అంశాలు
క్రికెట్‌తో సంబంధం లేకుండా ఉంటాయని ఆయన అన్నారు. అయినా ఇండో - పాక్ మధ్య క్రికెట్ సిరీస్‌ను పునరుద్దరించే
ప్రయత్నాలు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
గతంలో తరహాలో ఆ రెండు దేశాలు క్రికెట్ ఆడాలన్నదే తన అభిమతమని, కానీ ఆ
రెండు దేశాల మధ్య భౌగోళిక సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తిస్తామన్నారు.
వీరి మధ్య క్రికెట్ పోటీ జరిగితే చాలా బాగుంటుందని తెలిపారు.
ఇందుకోసం తను ఆ రెండు
దేశాలు మళ్లీ క్రికెట్ ఆడేందుకు తమ స్థాయిలో ప్రయత్నిస్తామని బార్‌క్లే
తెలిపారు. దీనికోసం ఆడించే ప్రయత్నం తప్ప, ఆ దేశాలపై ప్రభావం చూపే నిర్ణయం తాను తీసుకోలేనన్నారు.
పాకిస్థాన్ కవ్వింపు చర్యలను ఆపకుంటే ఆ దేశంతో క్రికెట్ ఆడేది లేదని గతంలో
భారత్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రేరేపించడం వల్ల ఇండియా వారితో
తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ దేశంతో క్రికెట్ ఆడడం మన దేశం
ఆపేసింది.