గుళ్ళు కట్టడానికి నేను దేవుడిని కాను...
By: chandrasekar Tue, 01 Dec 2020 7:34 PM
సోనూసూద్ ఆపద సమయంలో
ఆపద్భాందవుడిగా నిలిచి అందరివాడు అనిపించుకున్నాడు. ఆయన చేసిన సేవలకు అంతే
లేదు. చేతికి ఎముక లేనట్టు అనేక సాయాలు చేసిన సోనూసూద్ ప్రజల గుండెల్లో
దేవుడిగా కొలవబడుతున్నాడు. కొందరేమో ఆయనకు గుళ్లు కట్టి దేవుడిగా
పూజిస్తున్నారు. హారతులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సహా ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ప్రజలు సోనూసూద్‌పై అమితమైన
ప్రేమని చాటుకుంటున్నారు.
సోనూసూద్..తనకు గుడులు
కట్టి పూజలు చేయడంపై స్పందించారు. నేను దానికి అర్హుడిని కానంటూ చెబుతున్నారు.
కాని ప్రజలు మాత్రం నువ్వు మా ఆరాధ్య దైవ్యం అంటూ కొందరు బయట గుడులు కడుతుంటే
మరికొందరు గుండెల్లోనే కట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి
ఆచార్య షూటింగ్ చేస్తున్నాడు. అందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు సోనూ. అలానే అల్లుడు అదుర్స్ అనే చిత్రంలోను నటిస్తున్నాడు.