- హోమ్›
- వార్తలు›
- యాదాద్రి పునర్నిర్మాణంపై ప్రశంసలు కురిపించిన బీజేపీ నేత, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ
యాదాద్రి పునర్నిర్మాణంపై ప్రశంసలు కురిపించిన బీజేపీ నేత, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ
By: Sankar Sun, 13 Dec 2020 08:03 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పునర్నిర్మాణాన్ని మరో తిరుపతి లా చేపట్టినట్టు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.
శనివారం ఆయన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం దత్తాత్రేయ ఆలయ పనులను పరిశీలించి మాట్లాడారు.
ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా నిర్మాణం జరుగుతుందని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ..హైదరాబాద్ కు అత్యంత దగ్గర్లో ఉండటంతో పర్యాటకుల సంఖ్య కూడా బాగానే ఉంటుంది ..