హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన పెనుప్రమాదం
By: Sankar Mon, 14 Dec 2020 12:20 PM
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలం నుంచి గవర్నర్ దత్తాత్రేయ మరో వాహనంలో సూర్యాపేట బయల్దేరి వెళ్లారు...ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతోపాటు డ్రైవర్, ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇక . శనివారం ఆయన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ..రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పునర్నిర్మాణాన్ని మరో తిరుపతి లా చేపట్టినట్టు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు