హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
By: chandrasekar Tue, 29 Sept 2020 7:15 PM
హైదరాబాద్ నగరంలో సోమవారం
మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్
సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గత వారంలో నాలుగైదు
రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. శనివారం
రాత్రి వరకు వాన బాగా కురిసింది. ఆదివారం వాన లేకపోయినప్పటికీ చల్లని
గాలులు వీచాయి. అక్కడక్కడ కాస్త ఎండ కనిపించింది.
ఈ నెల 28న హైదరాబాద్, రంగారెడ్డి
జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన
విషయం విదితమే. ఈ క్రమంలో అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.