ఆంధ్రాలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు
By: chandrasekar Wed, 16 Sept 2020 3:44 PM
పశ్చిమ మధ్య
బంగాళాఖాతం తీవ్ర అల్పపీడనం బలహీనపడి అదే
ప్రాంతంలో అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు భారీ
నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాబోయే మూడు రోజుల్లో
ఉత్తర కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు
కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు
అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణా కోస్తాలోనూ
వాతావరణం ఇదే రకంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కృష్ణా జిల్లాలో భారీ
నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందని, గుంటూరు
జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ పడొచ్చని వెల్లడించింది. రాయలసీమలోని పలు చోట్ల
ఉరుములు, మెరుపులతో
పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు
జిల్లాలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.